- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : సామాన్య ప్రజలకు మేలు చేకూరుస్తూ ఆర్థిక వ్యవస్థను పటిష్ఠం చేసేలా కొత్త GST శ్లాబులు ప్రకటించామని ప్రధాని మోడీ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త నిర్ణయం రైతులు, మధ్యతరగతి ప్రజలు, మహిళలు, యువత, చిన్న-మధ్య తరహా పరిశ్రమలకు ఊతమిస్తుందని పేర్కొన్నారు. ఇది పౌరుల జీవితాలను మరింత మెరుగుపరుస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. చిరు వ్యాపారులు సులభంగా వ్యాపారం చేసుకునేందుకు దోహదపడుతుందని మోడీ వెల్లడించారు.
- Advertisement -