Monday, October 6, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంగుడిపూడి నాగేశ్వరరావుకు తమ్మినేని పరామర్శ

గుడిపూడి నాగేశ్వరరావుకు తమ్మినేని పరామర్శ

- Advertisement -

నవతెలంగాణ – బోనకల్‌
అనారోగ్యంతో బాధపడు తున్న ఖమ్మం జిల్లా బోనకల్‌ మండలం రామాపురం గ్రామానికి చెందిన సీపీఐ(ఎం) నాయకులు గుడిపూడి నాగేశ్వరరావుని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం ఆదివారం పరామర్శించారు. గుడిపూడి నాగేశ్వరరావు కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. రామాపురం సీపీఐ(ఎం) నాయకులు ఈ విషయాన్ని తమ్మినేని వీరభద్రం దృష్టికి తీసుకురావడంతో ఆయన నాగేశ్వరరావుని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని కోరారు. తమ్మినేని వెంట పార్టీ మండల కార్యదర్శి కిలారు సురేష్‌, మండల కమిటీ సభ్యులు కొమ్మినేని నాగేశ్వరరావు, గుడిపూడి వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్‌ కొండా నాగేశ్వరరావు, కేవీపీఎస్‌ మండల కార్యదర్శి గార్లపాటి రమేష్‌, నాయకులు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -