Friday, February 6, 2026
E-PAPER
Homeజాతీయంఎల్‌డీఎఫ్‌ జాతాకు అతిథి కార్మికుల సెల్యూట్‌

ఎల్‌డీఎఫ్‌ జాతాకు అతిథి కార్మికుల సెల్యూట్‌

- Advertisement -

తిరువనంతపురం : బతుకుతెరువు వెతుక్కుంటూ కేరళకు వచ్చే వలస కార్మికులను అతిథి కార్మికులుగా కేరళ ప్రభుత్వం పరిగణిస్తుంది. ఆ రీతిలోనే వారి పట్ల వ్యవహరిస్తూ వారి సంక్షేమానికి చర్యలు తీసుకుంటూ వుంటుంది. తాజాగా జరిగిన ఒక సంఘటన అక్కడి ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వం పట్ల వారికి గల గౌరవాన్ని తెలియచేస్తోంది. కేరళకు వచ్చిన చాలామంది వలస కార్మికులు కేరళను కేవలం తమకు ఉపాధి కల్పించిన ప్రాంతంగా చూడరు, తమ మాతృభూమిగా భావిస్తారు. జీవితంలో కష్ట కాలంలో ఉపాధి వెతుక్కుంటూ కేరళకు వచ్చిన వారు ఎన్నడూ నిరాశకు గురి కాలేదు.

ప్రభుత్వం, ప్రజలు వారిని ఆప్యాయంగా ఆదరించారు, వారికి మద్దతు తెలిపారు. తమకు ఆశ్రయమిచ్చిన ఈ రాష్ట్రం, వారు చూపిన సంరక్షణ, అభిమానానికి ప్రతిగా ఆ కార్మికులు కూడా తమ కృతజ్ఞతలను, సంఘీభావాన్ని తెలియచేశారు. పొలిట్‌బ్యూరో సభ్యులు, సీపీఐ(ఎం) కేరళ రాష్ట్ర కార్యదర్శి ఎం.వి.గోవిందన్‌ మాస్టర్‌ నేతృత్వంలో ధర్మాదం (కన్నూర్‌)కు వచ్చిన ఎల్‌డీఎఫ్‌ అభివృద్ధి జాతాకు వలస కార్మికులు ఇచ్చిన గౌరవ వందనం, స్వాగత సత్కారాలు, చూపిన ఆప్యాయతానురాగాలు మర్చిపోలేని అనుభవమని నాయకులు పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -