నీవు ముస్లింవా
హిందువివా
నాకనవసరం
నా తోబుట్టువివి.
ఇన్నాళ్లు గైడ్ అంటే
దారిచూపేవాడు
విషయాలు చెప్పేవాడే
అనుకున్నా…
బాధల్ని పంచుకునేవాడని
ఇప్పుడే తెలుసుకున్నా.
కన్నీళ్లు తుడవడమే కాదు
కష్టాల్లో తోడుంటావని
అవసరమైతే
ప్రాణాలు పణంగా పెట్టి
కాపాడుతావని
అర్థమైందన్నా…
దేశ రక్షణలో
సైనికునికంటే
నీ విలువ ఏ మాత్రం
తీసిపోదుగా…
కులమతాలకు
అతీతమైన
మానవ సంబంధం
మనకుందని
నిరూపించావన్నా…
ముష్కరుడు
ఏ మతంలో వున్నా
ముష్కరుడే అన్నా…
ఏ పేరుతోనైనా
మనుషుల్ని చంపడమే
వాడిపని అన్నా…
ముష్కరులనుండి
మాబోటి వారిని
కాపాడటమే
నీ పని కదన్నా…
అన్నా…!
నీలోనే నేను
నిజమైన దేశభక్తుడ్ని
చూస్తున్నా…
మనది జన్మజన్మల
సోదర బంధం అన్నా…
ఒట్టేసి చెప్తున్నా
పవిత్ర భారతీయ
బంధం అన్నా…
(కాశ్మీర్ ఇద్దరు అన్నలనిచ్చింది – ఆరతి వార్త చదివి)
- కె.శాంతారావు, 9959745723