Thursday, January 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎమ్మెల్యే డా.భూక్య మురళీ నాయక్ సహకారంతో గైడ్ కాలువ పరిశీలన 

ఎమ్మెల్యే డా.భూక్య మురళీ నాయక్ సహకారంతో గైడ్ కాలువ పరిశీలన 

- Advertisement -

ఉప సర్పంచ్ పిట్టల ఉప్పలయ్య, మాజీ వైస్ ఎంపీపీ జెల్లా వెంకటేష్
నవతెలంగాణ – నెల్లికుదురు 

మండలంలోని బ్రాహ్మణ కొత్తపెళ్లి గ్రామంలో మహబూబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ సహకారంతో గైడ్ కాలువను ఇరిగేషన్ అధికారులు పరిశీలించినట్లు మాజీ వైస్ ఎంపీపీ జిల్లా వెంకటేష్ ఉపసర్పంచ్ పిట్టల ఉప్పలయ్య తెలిపారు. గురువారం ఓ అండ్ ఎం ఎస్ సి  అధికారి సత్యనారాయణ రెడ్డి కన్స్ట్రక్షన్ ఎస్సీ రామకృష్ణ కలిసి పరిశీలించే కార్యక్రమంలో వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బ్రాహ్మణ కొత్తపెళ్లి గ్రామంలోని తూము నుండి పంట పొలాలకు నీరు పోయే పెద్ద కాలువ అయిన గైడ్ కాలువ ముళ్ళపదలతో నిండి, పూర్తిగా కాలువ సక్రమంగా లేకపోవడంతో పంటలకు వెళ్లే నీరు పూర్తిస్థాయిలో వెళ్ళలేకపోతుందని రైతు ఇబ్బంది పడుతున్నారు అనే ఉద్దేశంతో ఈ గ్రేడ్ కాలువ మరమ్మతు చేయడానికి మంజూరుకు పంపించామని అన్నారు.

అందులో భాగంగా ఈరోజు పరిశీలించేందుకు ఓ అండ్ ఎం ఎస్ సి సత్యనారాయణ రెడ్డి, మరియు కన్స్ట్రక్షన్ ఎస్సీ రామకృష్ణ , ఈ ఈ సురేష్ , డి ఈ రాందాస్,  ఏఈ సుష్మ లు కలిసి వచ్చి ఈ కాలువను పరిశీలించారని తెలిపారు. త్వరలో మాకు ఈ గైడ్ కాళ్లకు మంజూరు ఇప్పించి రైతాంగాని ఆదుకోవాలని కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు పెరుమాండ్ల మల్లేశం, పెరుమాండ్ల శంకర్, జెల్లా పరశురాములు, తాళ్ల శ్రీపాల్ రెడ్డి, తాళ్ల వెంకటరెడ్డి, పెరుమాళ్ళ శీను, తాళ్ల యాకన్న, దర్శనం ప్రవీణ్, జెల్లా ఉపేందర్, తాళ్ల ప్రభాకర్, సతీష్  ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -