Wednesday, December 10, 2025
E-PAPER
Homeరాష్ట్రీయండ్రోన్ల గిన్నిస్‌ రికార్డ్‌

డ్రోన్ల గిన్నిస్‌ రికార్డ్‌

- Advertisement -

బాణాసంచా వెలుగుల్లో గ్లోబల్‌ సమ్మిట్‌ ముగింపు
నవతెలంగాణ-హైదరాబాద్‌

గ్లోబల్‌ సమ్మిట్‌ ముగింపు వేడుకలో ఏర్పాటు చేసిన భారీ డ్రోన్‌ షో ఆకట్టుకుంది. తెలంగాణ రైజింగ్‌-2047 లక్ష్యాలు వివరించే థీమ్‌లతో ఈ షోను ఏర్పాటు చేశారు. గిన్నిస్‌ బుక్‌ రికార్డుకెక్కేలా మూడు వేల డ్రోన్‌లతో ప్రదర్శన నిర్వహించారు. గతంలో అబుదాబిలో 2,131 డ్రోన్ల ప్రదర్శనకు గిన్నిస్‌బుక్‌ రికార్డు వరించింది. తాజాగా 3 వేల డ్రోన్లతో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన డ్రోన్‌ ప్రదర్శన దీన్ని అధిగమించింది. దీంతో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ధ్రువపత్రాన్ని అందజేశారు. ఈ వేడుకల్లో బాణాసంచా వెలుగులతో గ్లోబల్‌ సమ్మిట్‌ ప్రాంగణం మెరిసిపోయింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -