Saturday, August 16, 2025
E-PAPER
spot_img
Homeఆటలుఆరో స్థానంలో గుకేశ్‌

ఆరో స్థానంలో గుకేశ్‌

- Advertisement -

ముస్సోరి (యుఎస్‌ఏ) : గ్రాండ్‌ చెస్‌ టూర్‌ నాల్గో ఈవెంట్‌ సెయింట్‌ లూయిస్‌ టోర్నమెంట్‌లో ప్రపంచ చెస్‌ చాంపియన్‌ దొమ్మరాజు గుకేశ్‌ వెనుకంజ వేశాడు. క్లాసికల్‌ ఫార్మాట్‌ రారాజు.. ర్యాపిడ్‌, బ్లిట్జ్‌ ఫార్మాట్‌లో పది మంది గ్రాండ్‌మాస్టర్లు పోటీపడుతున్న టోర్నమెంట్‌లో ఒక్క విజయమే సాధించాడు. బ్లిట్జ్‌ ఫార్మాట్‌లో తొలి దశ 9 రౌండ్లు పూర్తి కాగా.. గుకేశ్‌ నాలుగు పరాజయాలు, నాలుగు డ్రాలతో నెట్టుకొచ్చాడు. ర్యాపిడ్‌ ఫార్మాట్‌లో మెరవటంతో గుకేశ్‌ 10 పాయింట్లతో ఇప్పటికీ ఆరో స్థానంలో నిలిచాడు. యుఎస్‌ఏ గ్రాండ్‌మాస్టర్‌ ఆరోనియన్‌ లెవాన్‌ 19 పాయింట్లతో అగ్రస్థానంలో నిలువగా.. ఫాబియానో కారువానా (17) రెండో స్థానంలో నిలిచాడు. నేడు రెండో దశ బ్లిట్జ్‌ 9 రౌండ్లతో టైటిల్‌ విజేతను తేల్చనున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad