ఘటన స్థలాన్ని సందర్శించిన సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
నవతెలంగాణ – హైదరాబాద్: ప్రభుత్వ వ్యవస్థల నిర్లక్ష్యం మూలంగా చార్మినార్ ప్రక్కన ఉన్న గుల్జార్ హౌస్ లో ఏసీ షార్ట్ సర్క్యూట్ కారణంగా 17 మంది చనిపోవడం ఆందోళన కలిగిస్తున్నదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. నేడు ఘటన జరిగిన ప్రాంతాన్ని రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి అబ్బాస్, హైదరాబాద్ సౌత్ జిల్లా ప్రతినిధి బృందంతో కలిసి ఘటన జరిగిన ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా స్థానికులను కలిసి వివరాలు తెలుసుకున్నారు. ఘటన జరిగిన వెంటనే అత్యాధునిక ఎమర్జెన్సీ సౌకర్యాలు కలిగిన సామాగ్రితో సిబ్బంది సకాలంలో వచ్చి ఉంటే ఈ ఘటనలో ఇన్ని ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చుండేది కాదన్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. అక్కడికి ఫైరింజన్లలో సరిపడ నీళ్లు, ఆక్సీజన్ సిలిండర్లు, మాస్క్ లు లాంటివి రాకపోవడం, వల్ల అలాగే వెంటనే ఘటనా స్థలానికి చేరుకోకపోవడం లాంటి కారణంతో ఇంతమంది సామాన్య కుటుంబాలవారు చనిపోయారని తెలిపారు. చనిపోయిన కుటుంబాలకు అన్నివిధాల రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు జరగకుండా అన్ని రకాల జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకోవాలని ఆయన కోరారు. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి అబ్బాస్ మాట్లాడుతూ.. జనసాంద్రత ఎక్కువగా ఉండే ఈ నివాస ప్రాంతాల్లో ఉండే ప్రజలకు ప్రభుత్వ అధికారులు సరైన అవగాహన కలిగించకపోవడం ఈ దుర్ఘటనకు కారణమని అభిప్రాయపడ్డారు. ప్రతినిధి బృందంలో సీపీఐ(ఎం) హైదరాబాద్ సౌత్ జిల్లా నేతలు ఎమ్.మీనా, జి. విఠల్, పి.నాగేశ్వర్, ఎస్ కిషన్, కే జంగయ్య, ఏ కృష్ణ, బాబర్ ఖాన్, రాంకుమార్, యాకూబ్, శ్రీనివాస్ తదితరులున్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే గుల్జార్ హౌస్ ఘటన: సీపీఐ(ఎం)
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES