Tuesday, March 31, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చికిత్స పొందుతూ గుమ్మడి ఆంజనేయులు మృతి

చికిత్స పొందుతూ గుమ్మడి ఆంజనేయులు మృతి

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు టౌను  
ఆలేరు సబ్ డివిజన్‌కు చెందిన యాదగిరిగుట్ట సెక్షన్ విద్యుత్ శాఖ లైన్మెన్  1104 సబ్ డివిజన్ లీడర్ గుమ్మడి ఆంజనేయులు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలై చికిత్స పొందుతూ మంగళవారం మరణించగా.. ఆంజనేయులు  మృతదేహాన్ని యాదాద్రి జిల్లా 1104 నాయకత్వం పరామర్శించి, 1104 యూనియన్ జెండాతో పూలమాలలు అర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. 

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు పడిగం యాదగిరి,జిల్లా కార్యదర్శి ఎస్. అమర్నాథ్ మాట్లాడుతూ..  1104 యూనియన్ ఒక మంచి నాయకుడిని కోల్పోయిందని అన్నారు. ప్రతి కార్మిక సమస్య పరిష్కారం కోసం ప్రధాన సమస్య ఈపీఎఫ్ నుండి జీపీఎఫ్ సాధన కోసం బలంగా పోరాడిన ఆయన, కార్మికుల హక్కుల కోసం అహర్నిశలు కష్టపడ్డారని గుర్తు చేశారు. ఏ కార్మికునికి కష్టం వచ్చినా “నేనున్నాను” అని ముందుండి ధైర్యం ఇచ్చే నాయకుడిగా అందరి హృదయాల్లో నిలిచిపోయారన్నారు 

ఆయన సేవలను స్మరించుకుంటూ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో  1104 నాయకులు జె. వెంకటేశం,మిర్జా షకీల్ బేగ్, రమేష్ రెడ్డి, పంపార సత్యనారాయణ, ఎన్. నరసింహ, గుణగంటి బాబుగౌడ్,  ఎల్ ఎం డి శ్రీనివాస్ యాదగిరిగుట్ట సెక్షన్ లీడర్ బెజ్జంకి రామిరెడ్డి, ఆలేరు సెక్షన్ నాయకులు  జె. యాదగిరి, రమేష్, నగేష్, శ్రీనివాస్, ప్రకాష్, సత్తయ్య బాబూరావు ఉద్యోగులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -