Friday, September 26, 2025
E-PAPER
Homeజాతీయంమావోయిస్టులు, జవాన్ల మధ్య కాల్పులు

మావోయిస్టులు, జవాన్ల మధ్య కాల్పులు

- Advertisement -
  • ఆరుగురు మావోయిస్టులు మృతి
  • ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ ఏరియాలో ఘటన
    రారుపూయ్‌ :
    భారీ వర్షాల కారణంగా కొంత విరామం ఇచ్చిన తర్వాత బస్తర్‌ ప్రాంతంలో మావోయిస్టులను తుదముట్టించేందుకు భద్రతా బలగాల కార్యకలాపాలు మళ్ళీ ఉధృతమయ్యాయి. నారాయణ్‌పూర్‌, దంతెవాడల మధ్య శుక్రవారం ఉదయం నుంచి హోరాహోరీగా పోరు సాగుతోంది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటివరకు ఆరుగురు మావోయిస్టులు మరణించారని భావిస్తున్నారు. ఈ సంఖ్య పెరిగే అవకాశముంది. అబుజమద్‌ ఏరియాలోని అడవుల్లో కీలకమైన సమావేశం కోసం మావోయిస్టులు పెద్ద సంఖ్యలో సమావేశమైనట్టు తమకు సమాచారం అందిందని సీనియర్‌ పోలీసు అధికారులు తెలిపారు. ఈ సమాచారం అందిన వెంటనే డ్రాగన్‌ రైజింగ్‌ గ్రూప్‌ (డీఆర్‌జీ) సైనికులను అక్కడకు పంపారు. ఉదయం 9గంటల ప్రాంతంలో సైనికులు, మావోయిస్టుల మధ్య కాల్పులు ఆరంభమయ్యాయి. దీనిపై ఎస్పీ గౌరవ్‌ రారు మాట్లాడుతూ, పోలీసులు వస్తున్న విషయం తెలియగానే మావోయిస్టులు అడవిలోకి పారిపోయారని తెలిపారు. ఆ తర్వాత ఇరు పక్షాల నుంచి కాల్పులు మొదలయ్యాయని చెప్పారు. ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -