– యశోదా ఆసుపత్రిలో కేసీఆర్ పార్టీ నేతలతో సుదీర్ఘ చర్చ
నవతెలంగాణ-సూర్యాపేట
సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం గురువారం యశోదా ఆసుపత్రిలో అడ్మిట్ అయిన బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును పలువురు పార్టీ నేతలు పరామర్శించారు. శుక్రవారం సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ పార్టీ నాయకులతో ఇష్టాగోష్టి నిర్వహించారు. రాష్ట్రంలోని పరిస్థితులు, రైతులకు యూరియా ఎరువుల సరఫరా, సాగునీటి ప్రాధాన్యం, వ్యవసాయ సమస్యలు, సమకాలీన రాజకీయ అంశాలపై వారితో విస్తృతంగా చర్చించారు. ఉద్యమకారులు, నాయకుల నుంచి ఫీడ్‌బ్యాక్ సేకరించి, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై సూచనలు ఇచ్చినట్లు సమాచారం.
కేసీఆర్ ను పరామర్శించిన గుంటకండ్ల జగదీష్ రెడ్డి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES