నవతెలంగాణ-ఇబ్రహీంపట్నం
బీటెక్ చదువుతున్న విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలోని గురునానక్ ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్‌లో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా నందిగూడెం మండలం శ్రీరంగపురం గ్రామానికి చెందిన కందిమల్ల నాగేశ్వరరావు కుమారుడు సాయి(20) ఇబ్రహీంపట్నం మున్సిపల్ కేంద్రంలోని దివ్య హాస్టల్‌లో ఉంటూ గురునానక్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం ఉదయం హాస్టల్ గదిలోని రూమ్‌లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే ఆత్మహత్యకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
గురునానక్ ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



