Friday, July 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సతీష్ ఆధ్వర్యంలో గురుపౌర్ణమి వేడుకలు 

సతీష్ ఆధ్వర్యంలో గురుపౌర్ణమి వేడుకలు 

- Advertisement -

నవతెలంగాణ- గోవిందరావుపేట  : మండలంలోని పసర గ్రామంలో బిజెపి మండల అధ్యక్షుడు మార్క సతీష్ ఆధ్వర్యంలో గురువారం గురు పౌర్ణమిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ గురు పౌర్ణమి గురువులు, మార్గదర్శకులు మరియు ఉపాధ్యాయులను గౌరవించడానికి అంకితం చేయబడిందనీ విద్యాబుద్ధులు ప్రసాదించిన గురువులను పూజించి, కానుకలు సమర్పించుకుంటారని అన్నారు. . ఈ పండుగలో ప్రార్థనలు మరియు గురువుల ఆశీర్వాదాలు ఉంటాయి. ఈ రోజు మహాభారత రచయిత మహర్షి వేద వ్యాసుని జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించడం జరుగుతుంది.

పసర లోని రామాలయం ప్రాంగణంలో పూజ్యులు గురువులు డింగరి రంగాచార్యులు, గురిజాల హనుమంత రెడ్డి, కొమరపాలెం సత్యనారాయణ, రిటైర్డ్  ఉపాధ్యాయులకు శాలువలు కప్పి, పూలమాలలు వేసి ,మిఠాయిలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు జిల్లా కార్యదర్శి కొత్త సుధాకర్ రెడ్డి, ఓ బి సి జిల్లా ప్రధాన కార్యదర్శి మెరుగు సత్యనారాయణ ,జిల్లా నాయకులు, కర్ర సాంబశివారెడ్డి ,వలపదాస్ రవిశంకర్, మండల ప్రధాన కార్యదర్శి బైరి అశోక్ ,ఓబీసీ మండలాధ్యక్షులు కుంట మార్కండేయ, ఏదునూరి రమేష్ ,వంగాల సోమిరెడ్డి ,మురళి, సామ మల్లారెడ్డి, ,ఆకుల రవి , కవిటం కిరణ్ మధుకర్ రెడ్డితదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -