నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలంలోని అనాజిపురం శివారులో గల స్థానిక దివ్య బాల విద్యాలయం ఉన్నత పాఠశాలలో స్వపరిపాలన, గురుపూజోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా పాఠశాల ఫౌండర్ ఫాదర్ కాటరాజులు హాజరైన నేటి విద్యార్థులు రేపటి సమాజానికి ఉత్తమమైన పౌరులుగా క్రమశిక్షణ అవసరమని చెప్పారు. కరస్పాండెంట్ చిన్నప్ప మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తు తరగతి గదిలోని టీచర్లపై ఆధారపడుతుందని అన్నారు. ప్రిన్సిపల్ సౌజన్య మాట్లాడుతూ స్వపరిపాలన దినోత్సవం లో పాల్గొనడం వల్ల విద్యార్థులకు ఉపాధ్యాయులలో ఉపాధ్యాయ వృత్తి ఎన్నో సవాళ్లతో కూడినదనే విషయం తెలుస్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ గా హాజరైన వందనా భాయ్ డి ఈ ఓ గా, తనుశ్రీ ఎంఈఓ గా, దీపక్ రెడ్డి ఫాదర్గా, ఆంటోనీ కరస్పాండెంట్ గా, వసంత్ ప్రిన్సిపల్ గా, అశ్విత ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులకు విద్యాబోధన చేసినట్లు తెలిపారు.
దివ్య బాల విద్యాలయంలో గురుపూజోత్సవ వేడుకలు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES