– టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ కార్యదర్శి అలగు వర్షిణి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సీఎంఏ ఫౌండేషన్ ( కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్) పరీక్షలో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు తమ సత్తా చాటారని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (టీజీఎస్‌డబ్ల్యూ ఆర్‌ఈఐఎస్) కార్యదర్శి డాక్టర్ అలగు వర్షిణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ మీడియట్‌లో ఎంఈసీ , సీఈసీ కోర్సు చదువుతూనే సీఎంఏ పరీక్షలో విశేష ప్రతిభ కనబరిచారని పేర్కొన్నారు. ఆ పరీక్షను ప్రతి ఏటా నవంబర్ , జూన్‌లో నిర్వహిస్తారని గుర్తు చేశారు. ఈ ఏడాది జూన్‌లో నిర్వహించిన ఈ పరీక్షలో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థకు చెందిన విద్యార్థులు మొత్తం 74 మంది విద్యార్థులు పరీక్ష రాశారని తెలిపారు. అందులో 39 మంది సీఎంఏ ఫౌండేషన్‌కు అర్హత సాధించారని పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం బ్రాంచ్‌లో 23 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 14 మంది , మేడ్చల్ బ్రాంచ్‌లో 23 మందికి 7 మంది , గౌలిదొడ్డి బ్రాంచ్‌లో 28 మందికి 18 మంది అర్హత సాధించారని తెలిపారు. సీఎంఏ ఫౌండేషన్ పరీక్షలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అభినందించారు.
సీఎంఏ ఫౌండేషన్ పరీక్షలోగురుకుల విద్యార్థుల సత్తా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES