నవతెలంగాణ – తుంగతుర్తి
గురుకులాలు గాడి తప్పి రోడ్డున పడ్డాయని, రాష్ట్రంలో పాలకులకు విద్యార్థుల గోస కనిపించడం లేదని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెపాక సాయిబాబా అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రభుత్వ అలసత్వం,అధికారుల నిర్లక్ష్యంతో ఏడాదిలోనే గురుకులాల పరిస్థితి దారుణంగా మారింది అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గురుకుల పరిస్థితి అద్వాన్నంగా తయారైందని స్థానిక గిరిజన పాఠశాలలో 600 మంది విద్యార్థులకు నాలుగే బాత్రూంలు ఉండడం గురుకులాల పరిస్థితికి అద్దం పడుతుందని పాఠశాల ప్రారంభించి నెలలు గడుస్తున్న ఉపాధ్యాయుల కొరత ఉండడంతో విద్యార్థులు చదువులకు ఆటంకం కలుగుతుందని అన్నారు. అనేక గురుకులలో అపరిశుభ్రత కొట్టుమిట్టాడుతున్నాయని గురుకులాల విద్యార్థుల పరిస్థితులను చక్కబెట్టే నాథుడే లేడని విమర్శించారు. పర్యవేక్షణ లోపం విద్యార్థుల పాలిట శాపంగా మారిందని ఆయన అన్నారు. జైల్ల కంటే గురుకులాల పరిస్థితి అద్వాన్నంగా ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి గురుకులాలను సందర్శించి కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు.
గాడి తప్పి రోడ్డున పడ్డ గురుకులాలు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES