- Advertisement -
ఐడీఓసీలో జిమ్ ప్రారంభించిన కలెక్టర్
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన జిమ్ ను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శుక్రవారం ప్రారంభించారు. ఐడీఓసీలోని మొదటి అంతస్తులో జిమ్ ను ఏర్పాటు చేయగా, కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం పలువురు ఉద్యోగులతో సరదాగా టేబుల్ టెన్నిస్ ను కలెక్టర్ ఆడారు. అన్ని జిమ్ పరికరాలను పరిశీలించారు.కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్,డీవైఎస్ఓ రాందాస్, ఆయా శాఖల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -