Tuesday, July 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో హెచ్ కేలూర్ ముందడుగు

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో హెచ్ కేలూర్ ముందడుగు

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో మద్నూర్ మండలంలోని హెచ్ కేలూర్ ముంద అడుగు వేస్తోంది ఈ గ్రామానికి 24 ఇండ్లు మంజూరు. కాగా 14 మంది లబ్ధిదారులు ఇల్లు నిర్మాణాలు చేపట్టి వీరిలో పదిమంది లక్ష రూపాయల చొప్పున ప్రభుత్వ డబ్బులు పొందారు. మిగతా పదిమంది ఇందిరమ్మ లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణాల కోసం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు చురుగ్గా సాగుతున్నాయి. పదిమంది లబ్ధిదారుల ఇల్లు దాదాపు లెంటల్ లేవల్ కు వచ్చాయి. వీరందరికీ మొదటి విడత ప్రభుత్వ డబ్బులు అకౌంట్లో జమ అయినట్లు లబ్ధిదారులు తెలిపారు. ప్రజా ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల కోసం ఆ గ్రామ పంచాయతీ సెక్రెటరీ విజయ్ ప్రత్యేకంగా చొరవ చూపుతున్నారు. రోజువారి పరిశీలనలు జరుపుతూ లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తూ ఇందిరమ్మ ఇల్లు పూర్తి కావడానికి ఆయన కృషి లబ్ధిదారులంతా అభినందిస్తున్నారు. మంగళవారం నాడు నవ తెలంగాణ హెచ్ కేలూరు కు సందర్శించి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు గురించి పరిశీలన జరుపగా లబ్ధిదారుల వద్ద జిపి సెక్రెటరీ విజయ్ సర్వే కార్యక్రమాల్లో ఉన్నారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం ఇసుక గాని ఇతర సమస్యల గురించి ఆయన లబ్ధిదారులకు అండగా ఉంటున్నారని గ్రామస్తులు తెలిపారు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో హెచ్ కేలూర్ ముందడుగు కనిపిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -