Saturday, October 18, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంహెచ్‌1బీ వీసా రుసుము పెంపు తగదు

హెచ్‌1బీ వీసా రుసుము పెంపు తగదు

- Advertisement -

ఈ చర్య చట్ట విరుద్ధం, వ్యాపారాలకు హాని : యూఎస్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ దావా

వాషింగ్టన్‌ : హెచ్‌1బీ వీసాల దరఖాస్తుల వార్షిక రుసుమును పెంచడాన్ని వ్యతిరేకిస్తూ ట్రంప్‌ యంత్రాంగంపై యూఎస్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ దావా వేసింది. ఈ రుసుము చట్ట విరుద్ధమని, అమెరికా వ్యాపారాలకు తీవ్ర హాని కలిగిస్తుందని పేర్కొంది.వార్షిక ఖర్చులను గణనీయంగా పెంచాల్సి వస్తుందని, తక్కువ నైపుణ్యం కలిగిన కార్మికులను నియమించాల్సి వస్తుందని వాదించింది. ట్రంప్‌ కార్యనిర్వాహక శాఖ అధికారాన్ని అధిగమించారని, ఫెడరల్‌ గవర్నమెంట్‌ ఏజెన్సీలు దానిని అమలు చేయకుండా నిరోధించాలని వాషింగ్టన్‌ డీసీలో గురువారం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ దాఖలు చేసిన వ్యాజ్యంలో కోరింది. అమెరికా పౌరులు కాని వారు ప్రవేశించకుండా అడ్డుకునే అధికారం అధ్యక్షుడికి ఉంది కానీ ఆ అధికారం చట్టానికి కట్టుబడి ఉంటుందని, కాంగ్రెస్‌ ఆమోదించిన చట్టాలను ఉల్లంఘించడం సరికాదని పేర్కొంది.

టెక్‌ కంపెనీలు భర్తీ చేయడం కష్టతరమైన అధిక నైపుణ్యం కలిగిన కార్మికుల కోసం హెచ్‌1బీ వీసాలు ఉద్దేశించబడ్డాయని, భారత్‌కు చెందిన టెక్‌ కార్మికులతో సంబంధం కలిగి ఉంటాయని పేర్కొంది. భారతదేశానికి చెందిన సుమారు మూడొంతుల మంది నైపుణ్యం కలిగిన కార్మికులు ఉంటారని పేర్కొంది. కానీ ఆ వర్గం వెలుపల ఉన్న ఉపాధ్యాయులు, వైద్యులు వంటి క్లిష్టమైన వారు కూడా ఉన్నారని తెలిపింది. రుసుము పెంపు హెచ్‌1బీ వీసాలను నియంత్రించే ఇమ్మిగ్రేషన్‌ చట్టాలను, వీసాలను ప్రాసెస్‌ చేయడంలో ప్రభుత్వం చేసే ఖర్చుల ఆధారంగా రుసుములు ఉండాలనే నిబంధనను ఉల్లంఘిస్తున్నాయని దావాలో వాదించింది. అమెరికా కార్మికులకు బదులుగా విదేశాల నుంచి చవకగా టెక్‌ కార్మికులను భర్తీ చేస్తున్నారని ఆరోపిస్తూ.. ట్రంప్‌ యంత్రాంగం హెచ్‌1 బీ వీసాల వార్షిక రుసుమును 10,000డాలర్లు (88లక్షలు) పెంచుతున్నట్టు గత నెల ప్రకటించిన సంగతి తెలిసిందే. అనంతరం ప్రస్తుత వీసా హౌల్డర్లకు ఈ రుసుము వర్తించదని పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -