Monday, February 2, 2026
E-PAPER
Homeమానవిజుట్టు సంరక్షణ ఇలా..

జుట్టు సంరక్షణ ఇలా..

- Advertisement -

వాతావరణ ప్రభావం వల్ల చాలామందికి చుండ్రు, వెంట్రుకలు రాలిపోవడం జరగుతుంది. కొన్ని జాగ్రత్తలు పాటించి ఈ సమస్య నుంచి ఎలా బయట పడవచ్చో తెలుసుకుందాం.

ఉసిరి : జుట్టు రాలే సమస్యతో పాటు చుండ్రుని నివారించడంలో ఉసిరి ఎంతో మేలు చేస్తోంది. ఎండబెట్టిన ఉసిరికాయలను కొబ్బరినూనెలో వేసి వేడి చేయాలి. అది చల్లారాక జుట్టుకు మర్దన చేసుకోవాలి. దీని వల్ల మంచి ఫలితం ఉంటుంది.
కొబ్బరి పాలతో మసాజ్‌ : పచ్చి కొబ్బరిని తురిమి, మిక్సీలో వేసి గ్రైండ్‌ చేసి పాలు తీయాలి. ఈ పాల మిశ్రమాన్ని తలకు, జుట్టంతా పట్టించి మసాజ్‌ చేయాలి. 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత నీటితో స్నానం చేయాలి. దీనివల్ల జుట్టు మదువుగా, కాంతివంతంగా మారుతుంది. జుట్టురాలడం, పొడి బారడం, తలంతా దురద పెట్టడం వంటి సమస్యలూ తలెత్తవు.
పెరుగు, నిమ్మ : ఇంట్లో ఎప్పుడూ అందుబాటులో వుండే పెరుగు, నిమ్మకాయలు జుట్టుకు ఎంతో మేలు చేస్తాయి. ఒక కప్పు పెరుగులో కాస్త నిమ్మరసం కలపండి. తర్వాత మిశ్రమాన్ని తలకు పట్టించాలి. అరగంట తర్వాత షాంపూతో కడిగి వేయాలి. నిమ్మరసం చుండ్రును తగ్గించటానికి, పెరుగు జుట్టు మదుత్వం, మెరుపుదనం కోసం చక్కగా ఉపయోగపడతాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -