చిరంజీవి నటించిన చిత్రం ‘మన వరశంకర ప్రసాద్ గారు’. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పై సాహు గారపాటి, సుష్మితా కొణిదెల నిర్మించారు. ఈ సినిమా విశేష ప్రేక్షకాదరణతో 109 సెంటర్లలో 50 రోజుల థియేట్రికల్ రన్ సాధించింది. ప్రస్తుతం ఓటీటీల ప్రభావంతో థియేటర్ రన్స్ తగ్గిపోతున్న పరిస్థితుల్లో కూడా, జీ5లో విడుదలైన తర్వాత కూడా ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులను అలరించింది. ఈ చిత్రం రీజినల్ స్థాయిలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. చిరంజీవి, అనిల్ రావిపూడి కెరీర్‌లో తొలి 400 కోట్ల బ్లాక్‌బస్టర్‌గా రికార్డు సృష్టించింది.
ఉత్తర అమెరికాలో దాదాపు 3.5 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించి గ్లోబల్ మార్కెట్‌లో కూడా తన పవర్‌ని చాటింది. అలాగే బుక్‌మైషోలో 3.8 మిలియన్లకు పైగా టికెట్లు అమ్ముడవడం రీజినల్ సినిమాల్లో హయ్యస్ట్ రికార్డ్. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌కు పేరుపొందిన అనిల్ రావిపూడి మరోసారి అన్ని వయస్సుల ప్రేక్షకులను ఆకట్టుకునే క్లాసిక్‌ను అందించారు. పండుగ సీజన్‌లో ఫ్యామిలీస్ మెయిన్ ఛాయిస్‌గా నిలిచిన ఈ చిత్రం ప్రత్యేక స్థానం సంపాదించింది. కీలక పాత్రలో విక్టరీ వెంకటేష్ నటించడం, అలాగే కమాండింగ్ పాత్రలో నయనతార కనిపించడం అదనపు ఆకర్షణగా నిలిచింది అని చిత్రయూనిట్ తెలిపింది.
109 సెంటర్లలో అర్థ శతదినోత్సవం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



