నిశీధి మేఘాలు కమ్ముకున్నప్పుడు
గుండె పగిలిన శబ్దం
అచేతనమైన కన్నులను పొడుస్తుంది.
మాటలు కోల్పోయిన గాజుల తడిలోంచి
ఊపిరిబీ ముక్కలై రాలుతుంది.
దశ్యాలుు రక్తపు కన్నీళ్లలో తేలుతున్న నిశ్శబ్ద గాథలు.
ఆమె ఆక్రందనలో, నా దేశం పచ్చి బాలింత.
ఆమె శోకమయ నేత్రాల లోయల నుండి
ఒట్టిపోయిన నదుల్లోకి
భయకంపిత చరిత్ర తర్జుమా అవుతోంది.
తను కోల్పోయింది బిడ్దనో, భర్తనో కాదు, నమ్మకాన్ని.
తనది భయం కాదు భరోసా లేనితనం.
ఓ అరాచక అనిశ్చితి కలల పునాదిని నేలమట్టం చేసింది.
నిరవధిక అబద్దపు ఆప్తవాక్యం.
పెదవులపై దేశాన్ని మోస్తూ
అతని మత పాదాల కింద నలిగిన
మూడు రంగుల జెండాకు
ఉగ్రవాద పాటను రచించిన వాడికి నక్షత్రం లేనిు
సగం కోసిన చందమామ.
లిప్తకాలపు అలజడిలో
గర్భస్రావమై బిడ్డను కోల్పోయిన అనాధ
భారతదేశం.
చీము, నెత్తురు, ఉమ్మునీటిలో
తడిసిన రిక్త దేహాలు నా దేశ ప్రజలు.
వాడికి, వీడికి కావాల్సింది మతోన్మాద ఉగ్రవాదం
కొట్టుకుందామా? కలిసి పోరాడదామా?
– జాని తక్కెడశిల, 7259511956
సగం కోసిన చందమామ
- Advertisement -
- Advertisement -