Thursday, May 15, 2025
Homeతెలంగాణ రౌండప్ప్రయివేటు డిగ్రీ విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వాలి

ప్రయివేటు డిగ్రీ విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వాలి

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్: యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యం ఎలాంటి షరతులు లేకుండా విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వాలని  జిల్లా కలెక్టరేట్ పరిపాలన అధికారి కి ఎన్ఎస్ యు  ఐ  నాయకులు సురుపంగ చందు వినతి పత్రం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ  సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షలకు హాల్ టికెట్లు ఇవ్వకుండా విద్యార్థులను తీవ్ర ఆందోళనలకు, ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. కళాశాలలో చేర్చుకునేటప్పుడు ఎలాంటి ఫీజులు ఉండవని కేవలం పరీక్ష ఫీజు మాత్రమే చెల్లించాలని చెప్పి నేడు అదనపు ఫీజు చెల్లిస్తేనే హాల్ టికెట్లు ఇస్తామని విద్యార్థులను బెదిరింపులకు గురి చేస్తున్నారని, హాల్ టికెట్లు ఎందుకు ఇవ్వరు అని విద్యార్థులు యాజమాన్యాలను అడిగితే వారిపై అహంకారపు దూషణలకు పాల్పడుతున్నారని, ప్రైవేటు డిగ్రీ కళాశాలలు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ, విద్యార్థుల దగ్గర నుండి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారని, దీనివలన పేద విద్యార్థులు డిగ్రీ పరీక్షలకు దూరం అవుతున్నారని, వీటిపై అధికారులు దృష్టి సారించి విద్యార్థులకు తగిన న్యాయం చేయాలని కోరారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -