Friday, March 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పదవ తరగతి విద్యార్థులకు హాల్ టికెట్లు అందజేత

పదవ తరగతి విద్యార్థులకు హాల్ టికెట్లు అందజేత

- Advertisement -

 నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
వేల్పూర్ మండలం రామన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం 10వ తరగతి విద్యార్థులకు హాల్ టికెట్లను అందజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శివాజీ చేతుల మీద విద్యార్థులందరికీ హాల్ టికెట్లను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు మంచిగా చదివి పరీక్షల్ని బాగా రాయడం ద్వారా అత్యుత్తమ మార్కులు సాధించాలని ఆకాంక్షించారు. ఉత్తమ మార్కులు సాధించడం ద్వారా పాఠశాలకు, ఉపాధ్యాయులకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలన్నారు. విద్యార్థులు పరీక్షల సమయంలో సమయం వృధా చేయకుండా కష్టపడి చదవాలన్నారు. పరీక్షలు రాసేటప్పుడు విద్యార్థులు ఒత్తిడికి గురి కావద్దని, ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు. విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మనోహర్, శ్రీకాంత్, గణేష్, శ్యాం, చరణ్, సరిత, సుహాసిని, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -