Saturday, July 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భువనగిరిలో దొంగల హాల్‌చల్‌

భువనగిరిలో దొంగల హాల్‌చల్‌

- Advertisement -

పగలురెక్కీ రాత్రి దొంగతనాలు
వారంలో రోజులలో ఒకే కాలనీలో ఆరు ఇళ్లలో చోరీ
ఉదయం మూడు గంటల సమయంలోనే దొంగతనాలు.
నవతెలంగాణ – భువనగిరి

భువనగిరి పట్టణంలోని హౌజింగ్‌బోర్డు కాలనీలో గురువారం ఉదయం 3 గంటల సమయంలో దొంగలు హాల్‌చల్‌ సృష్టించారు. కాలనీకి చెందిన వృద్దురాలు శేషుకుమారి రంగారెడ్డి జిల్లా మల్లాపురంలో తన కొడుకు వద్ద ఉంటుంది. రెండు వారాలకు ఒక సారి భువనగిరికి వచ్చి వెళ్తుంది. ఇందే క్రమంలో వారం రోజుల క్రితం వచ్చిన ఆమె నాలుగు తులాల బంగారం అభరణాలు, 11 వేల ఇంట్లో పెట్టి మరించిపోయి తన కుమారుని ఇంటికి వెళ్లింది. ఇంట్లో ఉండడం లేదని గమనించిన దొంగలు ఇంటి తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించి రూ.4 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.11 వేల నగదును దోచుకెళ్లారు. దీంతో పాటు నల్లగొండలో ఉంటున్న భువనగిరికి చెందిన రిటైర్డ్‌ ఉపాధ్యాయులు రంగారావు, ఎంఏ లిగోరి ఇండ్లలోకి వెళ్లాగా అక్కడ ఏమి దొరకపోవడంతో వెనుదిరి వెళ్లారు. సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు చోరీ జరిగిన ఇండ్లను సందర్శించి ఆధారాలు సేకరించి సీసీ కేమేరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పట్టణ ఇన్స్పెక్టర్ ఎం. రమేష్‌కుమార్‌ తెలిపారు. ఈ నెల 18వ తేదిన ఇదే ప్రాతంలో మూడు ఇళ్లలో చోరి జరిగింది. పగలురెక్కీ నిర్వహించాకే రాత్రి దొంగతనాలు చేస్తున్నారని పలువురు భావిస్తున్నారు. ఈ నెల 11వ తేదిన మధ్యాహ్నాం రాంనగర్‌లోని బస్తీ దవఖానాకు వెళ్లి ఇంటికివెళ్తున్న పోతంశెట్టి శారధ మెడ నుంచి నాలుగు తులాల నుంచి బంగారు గొలుసును లాక్కొని వెల్లారు. భువనగిరి పట్టణంలో వరుస చోరీ ఘటనలు పట్టణంలో చర్చనీయాంశంగా మారాయి. చోరీల నియంత్రణకు పోలీసులు నిఘా పెంచాలని పలువురు అంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -