మరో రూ.6 వేలు ప్రియం
న్యూఢిల్లీ : బంగారాన్ని మించి వెండి ధరలు పెరుగుతోన్న వేళ కేంద్రం కీలక యోచన చేస్తోంది. వినియోగదారులు మోసాలబారిన పడకుండా ఉండేలా బంగారం తరహాలోనే వెండికి కూడా హాల్‌మార్కింగ్ తప్పనిసరి చేయాలని భావిస్తోందని సమాచారం. ప్రస్తుతం మార్కెట్‌లో వెండి ఆభరణాలకు హాల్‌మార్కింగ్ తప్పనిసరి లేదు. కానీ.. ఇటీవల భారీగా ధరలు పెరుగుతుండటంతో వెండికి కూడా తప్పనిసరిగా హాల్‌మార్కింగ్ ఉండాలని పరిశ్రమ వర్గాల నుంచి డిమాండ్ పెరుగతోంది. ఈ నేపథ్యంలోనే హాల్‌మార్కింగ్ నిబంధనలు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు బీఐఎస్ డైరెక్టర్ జనరల్ సంజయ్ గార్గ్ తెలిపారు. బుధవారం హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల వెండిపై రూ.60 పెరిగి రూ.2,770గా నమోదయ్యింది. కిలో వెండిపై రూ.6000 ఎగిసి రూ.2.77,000గా పలికింది. కేవలం మూడు రోజుల్లోనే రూ.20వేలు పెరగడం గమనార్హం. 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల పసిడిపై రూ.550 తగ్గి రూ.1,38,270గా.. 22 క్యారెట్లపై రూ.500 తగ్గి రూ.1,26,750గా నమోదయ్యింది.



