Saturday, October 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చేతి వృత్తి దార్ల సమన్వయ కమిటీ సమావేశం 

చేతి వృత్తి దార్ల సమన్వయ కమిటీ సమావేశం 

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
చేతివృత్తిదారుల సమన్వయ కమిటీ నిజామాబాద్ జిల్లా కేంద్ర కార్యాలయంలో సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సమావేశానికి చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ ప్రారంభ నాయకులు పెద్ది వెంకట్రాములు అధ్యక్షత వహించగా రాష్ట్ర కన్వీనర్ ఎంవి రమణ, కమిటీ సభ్యులు ఉడుత రవీందర్, ఇడగొట్టి సాయిలు, ఎస్ రమేష్ గౌడ్, కామారెడ్డి సమన్వయ కమిటీ నాయకులు వెంకట్ గౌడ్, హాజరయ్యారు. అలాగే జిల్లాలోని వివిధ వృత్తి సంఘాల నాయకులు కోయడ నరసింహులు గౌడ్, కోటగిరి రామా గౌడ్, సుదర్శన్, సిదుగు శేఖర్ గౌడ్, రవి, అలాగే వడ్డెవర్దారుల సంఘం జిల్లా కార్యదర్శి ఇడగొట్టి వడ్డెన్న, సీనియర్ నాయకులు పి వెంకటేష్, మత్స్య కార్మిక సంఘం నాయకులు జి చంద్రకాంత్, విశ్వకర్మ సంఘం నాయకులు ఎన్ గోవర్ధన్, రజక సంఘం నాయకులు అభిమన్యు, సురేష్ తదితరులు పాల్గొన్నారు ఏ రమేష్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఏ రమేష్ బాబు లతోపాటు కెవిపిఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నల్వాల నరసయ్య, కొండ గంగాధర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కన్వీనర్ ఎం వి రమణ మాట్లాడుతూ…కేంద్ర ప్రభుత్వం స్వదేశీ వస్తువులు వాడాలని ప్రకటించటం హర్షనీయం.

వృత్తిదారులందరూ వెనుకబడిన తరగతులకు చెందిన వారే. మన ప్రధానమంత్రి వెనుకబడిన తరగతు వారిని చాలా ఆనందపడ్డాం. కానీ ఆయన పని చేసేది అగ్రవర్ణాలకు, కార్పొరేట్ సంస్థలకు తప్ప అసలు బీసీ వర్గాలకు ఎలాంటి సహాయ సహకారాలు అందించడం లేదు. చేతివృత్తులు కనుమరుగవుతున్న పట్టించుకోవటం లేదు. పైగా మొన్న స్వదేశీ వస్తువులే వాడాలని ప్రధానమంత్రి గారు ప్రకటించటం స్వాగతిచ్చాం. మేము సంకలు ఎగరేసుకొని గంతులు వేశాం. ఎందుకంటే స్వదేశీ వస్తువులు తయారు చేసేది చేతి వృత్తిదారులే. తయారీ అప్పగిస్తారేమో అని అనుకున్నాం కానీ కార్పొరేట్ సంస్థల ఆధీనంలో ఉత్పత్తి వస్తువులను స్వదేశీ వస్తువులుగా పరిగణిస్తారని అనుకోలేదు. అందుకొరకు స్వాదేశి వస్తు ఉత్పత్తిని ప్రోత్సహించాలని, ప్రజల ఆరోగ్యాలని కాపాడాలని, ఆర్థిక పరిస్థితిని కాపాడాలని అన్నారు.

అలాగే ఆర్మూర్ డివిజన్లో బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గాలలో వీడీసీల దౌర్జన్యాలు వృత్తిదారుల మీద, పేద బడుగు బలహీన వర్గాల మీద నిరంతరం కొనసాగుతా ఉన్నాయి. వాటి అన్నిటికి వ్యతిరేకంగా పనిచేస్తా ఉంది తెలంగాణ చేతివృత్తిదారుల సమన్వయ కమిటీ అని అన్నారు. అలాగే 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తుంది. అలాగే వీడీసీలకు వ్యతిరేకంగా బీడీసీల దౌర్జన్యాల నుండి వృత్తిదారులను కాపాడుకోవడం కోసం కూడా మా సమన్వయ కమిటీ పని చేస్తుంది అన్నారు. అందుకు జిల్లాలో ఉన్న అన్ని చేతివృత్తిదారులంతా కలిసి ఏకమై ఒక తాటి మీదికి రావాలని, నిర్మాణ రూపాన్ని బలపరుచుకోవాలని పిలుపునిచ్చారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -