Saturday, August 23, 2025
E-PAPER
spot_img
Homeసినిమావాస్తవ సంఘటనలతో 'చేతబడి'

వాస్తవ సంఘటనలతో ‘చేతబడి’

- Advertisement -

శ్రీ శారద రమణా క్రియేషన్స్‌ బ్యానర్‌ పై నంద కిషోర్‌ నిర్మాణంలో నూతన దర్శకుడు సూర్యాస్‌ రూపొందిస్తున్న చిత్రం ‘చేతబడి’ రియల్‌ ఇన్సిడెంట్స్‌ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
దర్శకుడు సూర్యాస్‌ మాట్లాడుతూ,’చేతబడి అనేది 16వ శతాబ్దంలో మన ఇండియాలో పుట్టిన ఒక కల. రెండు దేశాలు కొట్టుకోవాలన్నా, రెండు దేశాలు కలవాలన్నా ఒక బలం, బలగంతో ఉండాలి. కానీ ఒక ఈవిల్‌ ఎనర్జీతో మనిషిని కలవకుండా అతన్ని చంపే విద్యే చేతబడి. అది ఎంత భయంకరంగా ఉంటుందో ఇప్పటికే చాలా సినిమాల్లో చూపించారు. ఇందులో చాలా విభిన్నంగా చూపి స్తున్నాం. మన బాడీలో ప్రతిదానికి ప్రాణం ఉంటుంది. అఖరికి వెంట్రుకలకు కూడా ప్రాణం ఉంటుంది. ఆ వెంట్రుకల ఆధారంగానే ఈ సినిమా ఉంటుంది. 1953 గిరిడ అనే గ్రామంలో రియల్‌గా జరిగిన యదార్థ సంఘటనను ఆధారంగా చేసుకుని ఈ కథను సిద్ధం చేశాం. సీలేరు అనే గ్రామంలో 200 సంవత్సరాల క్రితం వెదురు బొంగులు చాలా థిక్‌గా ఉంటాయి. వర్షం పడినా అవి నెలలోకి దిగవు. అలాంటి మట్టిలో బతికున్న నల్లకోడిని పెట్టి, అమావాస్య రోజు బాణామతి చేస్తే ఎలా ఉంటుంది అనేది ఇందులో చూపించబోతున్నాం’ అని చెప్పారు. ‘ఒకప్పుడు బాణామతి భయం వల్ల రాజకీయ, సామాజిక, మానసిక సమస్యలు తలెత్తాయి. ప్రజల అమాయకత్వాన్ని కొందరు ఆసరాగా చేసుకున్న వారి గురించి ఈ చిత్రంలో రియలిస్టిక్‌గా చూపించబోతున్నాం’ అని నిర్మాత నందకిషోర్‌ చెప్పారు. ఈ చిత్రానికి సహ నిర్మాత : నరేష్‌ జైన్‌, క్రియేటివ్‌ హెడ్‌ : దీపిం.టి.అగర్వాల్‌, సంగీతం : అచ్చు రాజమణి, ఎడిటర్‌ : వంశీ, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ : నవీన్‌ బుక్క

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad