చట్టాన్ని పథకంగా మార్చిన బీజేపీ సర్కారు
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి తిలోదకాలు
కేంద్రం దయాదాక్షిణ్యాలపైనే స్కీం నిర్వహణ
125 రోజుల పని ఉత్తిదే
కూలీల స్థానంలో యంత్రాల ప్రవేశానికి అనుమతులు
దేశవ్యాప్తంగా భగ్గుమంటున్న వ్యవసాయ కార్మిక సంఘాలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గ్రామీణ భారతంలో ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా నీరుగార్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైం. అనేక పోరాటాల ఫలితంగా 2005లో యూపీఏ మొదటి ప్రభుత్వ హయాంలో వామపక్షాల మద్దతుతో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం(నరేగా)ను పార్లమెంట్ ఆమోంచిం. దీనితో గ్రామీణ పేదలకు ఏడాదిలో వందరోజుల పనిని కల్పించే బాధ్యతను కేంద్రప్రభుత్వం తీసుకుంది. అయితే 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక క్రమేణా ఈ చట్టానికి తూట్లు పొడవటం మొదలు పెట్టింది. నిధుల్ని గణనీయంగా తగ్గించడంతో పాటు ఈ చట్టం ద్వారా ఉపాధి పొందుతున్న గ్రామీణ కూలీల సంఖ్యను తగ్గించేందుకు రకరకాల నిబంధనల్ని అమల్లోకి తెచ్చింది. తాజాగా ఉపాధి హామీ సచట్టాన్ని కేంద్ర ప్రభుత్వ దయాదాక్షిణ్యాలతో నడిచే ‘పథకం’ (స్కీం)గా మార్పు చేసిం. పనిదినాలను వంద రోజుల నుంచి 125 రోజులకు పెంచుతున్నామని ప్రకటించింది. కానీ స్కీంగా మారిన తర్వాత కేంద్రం కేటాయించిన నిధుల మేరకే పనుల్ని చేపట్టాలి తప్ప, గ్రామీణ అవసరాల రీత్యా అదనపు పనులు చేయడానికి వీల్లేకుండా నిబంధనల్ని రూపొంంచింది. 2005 చట్టం ప్రకారం ఉపాధి హామీ పనుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ యంత్రాలను వినియోగించకూడదు. కానీ మోడీ ప్రభుత్వం ఇప్పుడు యంత్రాల వినియోగానికి అనుమతులు ఇస్తూ నిర్ణయం తీసుకురుంది. ఫలితంగా కాంట్రాక్టర్ల ద్వారా యంత్రాలతో పనులు చేయించి, కూలీలకు ఉపాధి లేకుండా చేసి, క్రమంగా ‘ఉపాధి హామీని నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా కేంద్రప్రభుత్వం వ్యవహరిస్తున్న. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎమ్‌జీఎన్‌ఆర్‌ఈజీఏ) పేరును కూడా పూజ్య బాపు గ్రామీణ రోజ్‌గార్ యోజన (పీబీజీఆర్‌వై)గా మార్చిం. కేవలం పేరు మాత్రమే మార్చారని భావిస్తున్న తరుణంలో కేంద్రం చేస్తున్న అసలు మోసం వెల్లడైం. తాజాగా ‘వికసిత్ భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవిక మిషన్ (గ్రామీణ్)’ (వీబీ-జీ రామ్‌జీ) పేరుతో మొత్తం చట్టాన్నే, స్కీంగా మార్చేశారు. దీన్ని ప్రస్తుత పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదం తెచ్చుకొనేందుకు మోడీ సర్కార్ ప్రయత్నిస్తున్న. ఈ చర్యను కాంగ్రెస్ సహా కమ్యూనిస్టులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కేంద్రంపై ఐక్యపోరాటాఁకి సిద్ధమవుతున్నారు. ఉపాధి హామీ చట్టాన్ని అలాగే కొనసాగించాలనీ, దాన్ని స్కీంగా మార్చడాన్ని సహించే లేదని తేల్చిచెప్తున్నారు.
కేంద్రం కొత్త పేరుతో తెచ్చిన ఈ స్కీంలో రాష్ట్రాలపై అదనపు భారాలు వేసేలా నిబంధనల్ని రూపొందించారు. కేంద్రం మంజూరు చేసిన నిర్ణీత మొత్తం ఖర్చయిపోతే, ఆ తర్వాతి పనులకు, కూలీల పనిదినాలకు రాష్ట్ర ప్రభుత్వాలే సొమ్మును చెల్లించాలని మెలిక పెట్టారు. దీఁవల్ల ఉపాధి హామీ చట్టం పూర్తిగా నిర్వీర్యం అవుతుందని వ్యవసాయకార్మిక సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో ఇప్పటికే తగ్గిన పనిదినాలు
తెలంగాణ రాష్ట్రంలో ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం ఏటా నిధుల్లో భారీ కోత విదిóస్తున్నది. గత ఏడాది రాష్ట్రంలో 12.5 కోట్ల పని దినాలు కల్పించగా, ఈ ఏడా కేవలం 7.5 కోట్ల పని దినాలకే పరిమితమైం. గ్రామీణ పేదలకు జీవనోపాధి భద్రత కల్పించడం, వలసలను తగ్గించడం, గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధిని సాధించడం వంటి గొప్ప లక్ష్యాలతో నాటి యూపీఏ ప్రభుత్వం ఈ చారిత్రక చట్టాన్ని అమల్లోకి తెచ్చిం. కేంద్ర ప్రభుత్వం గతంలో వంద శాతం నిధులు వెచ్చిస్తూ ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేసింది. మోడీ సర్కార్ తాజా నిర్ణయం వల్ల కేంద్రం వాటా 90 శాతం నుంచి 60 శాతానికి తగ్గి, రాష్ట్రాలపై 10 శాతం ఉన్న ఆర్థిక భారం 40 శాతాఁకి పెరుగుతుంది. ఈ చర్య రాష్ట్రాల ఆర్థిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుంధి.
చట్టం… పథకమైతే
చట్టం కాస్తా పథకంగా మారితే..ఉపాధి హక్కును హరించినట్టే. పథకం అనేది ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉంటుంది. ఇప్పటి వరకూ గ్రామీణ పేదలు అనుభవిస్తున్న ఉపాధిహామీ చట్టం ద్వారా కల్పించిన హక్కు రద్దవుతుంది. దేశంలో వ్యవసాయ సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ఏడాలో కనీసం 200 రోజులు పని కల్పించాలనీ, అలాగే రోజుకు రూ.600 వేతనం ఇవ్వాలని వ్యవసాయ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. కానీ మోడీ ప్రభుత్వం ఇప్పుడు అసలుకేే ఎసరు తెచ్చే నిర్ణయాలు తీసుకుంటున్న. కేంద్రం కేవలం భూస్వాములు, పెత్తందార్ల ఒత్తిళ్లకు తలొగ్గి ఈ తరహా నిర్ణయాలు తీసుకుంటున్నదనే విమర్శలు వస్తున్నాయి.
బిల్లు ప్రతుల్ని తగులబెట్టండి నేటి నుంచి దేశవ్యాప్త ఆందోళనలు బి వెంకట్, ప్రధాన కార్యదర్శి, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టానికి పాతరేసి, 197/2025 పేరుతో కొత్త బిల్లు తీసుకురావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ బిల్లు అమల్లోకి వస్తే వ్యవసాయ కార్మికులు తీవ్రంగా నష్టపోతారు. పాతచట్టాన్ని ఎందుకు రద్దు చేస్తున్నారో కేంద్రం వివరణ ఇవ్వాలి. గతంలో 100 రోజులు ఉన్న పనిని, ఇప్పుడు 125 రోజులకు పెంచుతున్నామనే ముసుగు తొడిగి, మొత్తానికే ఉపాధి చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. ఇప్పుడున్న చట్టం ప్రకారం గ్రామీణంలో పేదలు కోరిన 15 రోజుల్లో ఉపాధి పనిని కల్పించాలి. లేకుంటే నిరుద్యోగభృతి ఇవ్వాల్సి ఉంటుందని. ఇలాంటివన్నీ కొత్త పథకంద్వారా తొలగించే చర్యలకు మోడీ ప్రభుత్వం పాల్పడుతోంది. దీన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం నుంచి దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు నిర్వహించి, బిల్లు ప్రతులను దగ్దం చేయాలని పిలుపునిస్తున్నాం.
ఉపాధి హామీని చంపే కుట్ర- మంత్రి సీతక్క
మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని చంపే కుట్రకు కేంద్రం తెరలేపింది. ఆ చట్టం పేరునే కాకుండా, అమలు విధానాన్ని మార్చేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. కేంద్ర విధానం పేదలను, రాష్ట్రాలను శిక్షించే విధంగా ఉంది. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును ”వికసిత్ భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవిక మిషన్ (గ్రామీణ్) :వీబీ-జీ రామ్‌జీ”గా మార్చే బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. గతంలో వంద శాతం నిధులు వెచ్చిస్తూ పథకాన్ని అమలు చేసిన కేంద్రం ఇప్పుడు తన వాటాను 60 శాతానికి తగ్గించి, మిగిలిన 40 శాతం భారాన్ని రాష్ట్రాలపై మోపడం అన్యాయం. ఇది రాష్ట్రాల ఆర్థిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇ ప్రజాసంక్షేమ బాధ్యతల నుంచి కేంద్రం తప్పించుకునే ప్రయత్నం చేయడమే. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏ సంవత్సరంలోనూ 42 రోజులకన్నా ఎక్కువ పనినాలు కల్పించలేదు. ప్రతి ఏడా నిధుల్లో భారీ కోత విóస్తూ వస్తుంది. రాష్ట్రాలకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన న్యాయమైన నిధుల వాటాను కేంద్ర ప్రభుత్వం సెస్‌లు, సర్‌చార్జీల పేరుతో వసూళ్లు చేస్తూ ఫెడరల్ స్పూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం తక్షణం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
‘ఉపాధి’కి ఉరి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



