Thursday, May 29, 2025
Homeకరీంనగర్ హన్మాజీపేట నక్క వాగు ఉధృతి..

 హన్మాజీపేట నక్క వాగు ఉధృతి..

- Advertisement -

నవతెలంగాణ – వేములవాడ 
వేములవాడ రూరల్ మండలంలో మంగళవారం కురిసిన భారీ వర్షానికి హన్మాజీపేట సమీపంలోని నక్క వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వర్షపు నీరు భారీగా చేరడంతో వాగు పొంగిపొర్లుతోంది. తాజాగా నిర్మితమైన బ్రిడ్జి నిర్మాణం పూర్తికావడంతో వాహనాలు బ్రిడ్జి మీదుగా నిరాటంకంగా సాగుతున్నాయి. ప్రస్తుతం రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకపోయినప్పటికీ, వాగు ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉన్నందున స్థానికులు, ముఖ్యంగా రైతులు వాగు దాటి ప్రయాణించకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగం పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తూ ప్రజల భద్రత కోసం అన్ని చర్యలు తీసుకోనున్నారు. ప్రజలు అధికారుల సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -