Sunday, July 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వనదేవతలను దర్శించుకున్న హన్మకొండ కలెక్టర్

వనదేవతలను దర్శించుకున్న హన్మకొండ కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – తాడ్వాయి 
మేడారంలోని సమ్మక్క- సారలమ్మ వనదేవతలను హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిస్, ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిస్ లు సకుటుంబ సపరివారంగా శనివారం దర్శించుకున్నారు. పూజారులు, ఎండోమెంట్ అధికారులు ఆదివాసి సాంప్రదాయాల ప్రకారం, ఆలయ సంప్రదాయాల ప్రకారం డోలు వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. వనదేవతలకు ఇష్టమైన పసుపు కుంకుమ చీరే సారే సమర్పించి ప్రత్యేక మొక్కులు చెల్లించారు. పూజారులు ఎండోమెంట్ అధికారులు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించి వనదేవతల ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మనదేవతలను దర్శించుకోవడం ఎంతో ఆహ్లాదకరంగా ఉందని అన్నారు. వారి వెంట ములుగు జిల్లా పోలీసులు తదితరులు ఉన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -