డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, జిల్లా సహాయ కార్యదర్శి – గడ్డం వెంకటేష్ దయ్యాల మల్లేష్..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలం హనుమపురం నుండి అనంతరం వెళ్లే రోడ్డు గుంతల మాయంగా మారి ప్రమాదాలకు కారణం అవుతుందని వెంటనే రోడ్డు మరమ్మత్తులు చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జిల్లా సహాయ కార్యదర్శి గడ్డం వెంకటేష్ దయ్యాల మల్లేష్ డిమాండ్ చేశారు. సోమవారం డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో గుంతల మయంగా మారిన రోడ్డును పరిశీలించి అనంతరం వారు మాట్లాడుతూ
నిత్యం భువనగిరి నుండి హనుమాపురం అనంతరం మీదుగా హైదరాబాద్ వెళ్లడానికి ప్రత్యామ్నాయ మార్గమైన హనుమపురం రోడ్డు గుంతలమయంగా మారి అనేకమంది ప్రయాణికులు గుంతలలో కిందపడి గాయాల పాలైన సంఘటనలు అనేక ఉన్నాయని వారు అన్నారు. రాత్రి సమయాలలో ప్రయాణం చేస్తుంటే గుంతలు కనబడక అనేకమంది ప్రజలు విద్యార్థులు కార్మికులు గుంతలలో పడి అంగవైకల్యం అయిన సందర్భాలు కూడా ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్యాచ్ వర్క్ చేసి రోడ్డును మనుగడలోకి తీసుకొచ్చారు ఇప్పుడు అట్టి రోడ్డు మరింత గుంతల మాయంగా మారి ప్రజలకు ఉపయోగంలో లేకపోవడం వల్ల ప్రత్యామ్నాయం లేక ప్రజలు ఆ మార్గం వెంట వెళుతున్న క్రమంలో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని వారు అన్నారు. ఓట్ల సమయంలో అనేక హామీలు ఇచ్చిన స్థానిక శాసనసభ్యులు గెలిచిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధిపై ఎందుకు దృష్టి లేదని వారు ప్రశ్నించారు.
జిల్లా వ్యాప్తంగా గ్రామాలలో నెలకొన్న సమస్యలపై పల్లె పల్లెకు డివైఎఫ్ఐ పేరుతో సర్వే నిర్వహించి గ్రామీణ సమస్యలపై కలెక్టర్ కార్యాలయం ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు కుసుమ మధు, తోటకూర రమేష్, కుసుమ అశోక్, గ్రామ ప్రజలు ముద్దం కొమురయ్య, నరసింహ, మహేష్, రాజు లు పాల్గొన్నారు.