Thursday, April 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సలాబత్పూర్ లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

సలాబత్పూర్ లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

- Advertisement -

– తరలివచ్చిన మూడు రాష్ట్రాల భక్తులు

– పాల్గొన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్

నవతెలంగాణ మద్నూర్ :

హనుమాన్ జయంతి సందర్భంగా ఇటు తెలంగాణ అటు మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల్లో ప్రఖ్యాత గాంచిన మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ ఆంజనేయ స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వేడుకలను అంగరంగ వైభోగంగా నిర్వహిస్తాన్నారు. భక్తుల సహాయార్థం ఆలయ కమిటీ, ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మద్నూర్ ఎస్సై మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జుక్కల్ పెద్ద కొడప్పుగల్ తదితర మండలాలకు చెందిన ఎస్ఐలు పోలీసులు పాల్గొన్నారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య భక్తులు ప్రశాంతంగా దర్శనం చేసుకుంటున్నారు.

గురువారం ఉదయం తెల్లవారుజామున సలాబత్పూర్ ఆంజనేయ స్వామి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ పాల్గొన్నారు. ఆయనతోపాటు ఆలయ కమిటీ చైర్మన్ రామ్ పటేల్, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీధర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధరాస్ సాయిలు, మద్నూర్ గ్రామ సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ నరసింహులు, గౌడ్ మాజీ ఎంపీటీసీ విజయ్, ముఖ్య నాయకుల స్వామిని దర్శించుకున్నారు. ఆలయ ఆవరణంలో భారీ జాతరలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. హనుమాన్ జయంతి వేడుకలను ఊరూవాడాఅన్నదాన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -