- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 14వ వార్డులో గల శ్రీ లలితా త్రిపుర సుందరి సహిత సీతారామచంద్ర ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ప్రతి మంగళవారం నిర్వహించే హనుమాన్ చాలీసా పారాయణం అనంతరం ఆ వార్డు కౌన్సిలర్ రామ్ శెట్టి హర్షితను భక్తుల ఆధ్వర్యంలో ఆలయ పూజారులు వేదమంత్రాల మధ్య ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ హర్షిత మాట్లాడుతూ.. నన్ను చిన్న వయసులోనే మీరు ఆదరించి మీ అమూల్యమైన ఓట్లతో గెలిపించినందుకు వార్డ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. వార్డు అభివృద్ధి కోసం ప్రజల సూచనలు, సలహాలను స్వీకరిస్తూ ముందుకు సాగుతానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు, భక్తులు పాల్గొన్నారు.
- Advertisement -



