– భక్తి తో ఐక్యత…. బూడిద బిక్షమయ్య గౌడ్
నవతెలంగాణ -ఆలేరు రూరల్ : ఆలేరు మండలం సాయి గూడెం గ్రామంలో హనుమాన్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. విగ్రహ దాత గోపు నిఖిల్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం లో మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ పాల్గొని మాట్లాడుతూ గ్రామపంచాయతీ ఏర్పడిన తర్వాత పార్టీలకు అతీతంగా హనుమాన్ విగ్రహ ఆవిష్కరణ జరగడం సంతోషకరమని అన్నారు.గ్రామాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ఐక్యత, భక్తి భావం పెరుగుతుందని అన్నారు. శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో గ్రామాలలో ఆధ్యాత్మిక వాతావరణ నెలకొల్పిందని,భక్తులందరికి ఇది ఒక పుణ్యకార్యంగా నిలిచిందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గ్యార కవిత సంపత్, పీసీసీ ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఎం.ఏ.ఏజాజ్,కాంగ్రెస్ నాయకులు నీలం పద్మా వెంకటస్వామి, గుడి కమిటీ అధ్యక్షుడు రావి మధుసూదన్ రెడ్డి,బి.ఆర్.ఎస్ పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్,గోపు నవీన్ రెడ్డి,పుట్ట పవన్,మైల శ్రీశైలం, బీదని బాలరాజు,కొండ చంద్రారెడ్డి గంగాధరి సుధీర్ కుమార్,ఎం.డి గోరెమియ, కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి, బండి శ్రీనివాస్, ఇంజ రాజు, జనగాం వెంకటపాపి రెడ్డి, కోటగిరి పాండరి, కోరీకో ప్పుల కిష్టయ్య, సంగి స్వామి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆకవరం మోహన్ రావు, ఈదునూరి వెంకటరెడ్డి,తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు హనుమాన్ భక్తులు,పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.



