Sunday, March 29, 2026
E-PAPER
Homeసోపతిసంతోసం మనసుల్లోనే

సంతోసం మనసుల్లోనే

- Advertisement -

అందరూ వచ్చిండ్రు గద! ఎండ కొట్టగలా సెట్ల నీడ సుస్కోని కుసొండి గద? యాడికిబొయిన గొంతు, పెద్మలు తడ్పోకో నీకే ఇంటి నుండి బాటిల్లా నీల్నింపుకొని పోవాలని బాటిల్‌ ముద్దుగున్నవి దినం నల్ల నీళ్ళు వొచ్చినై
లే అందరూ నీళ్ళు వట్టొచ్చినట్టు ఉన్నరు మల్లిక్‌, అర్జున్‌ బట్టలని గట్ల తడుపుకున్నారు! అర్పోతాయి లే గాని కింద మీద బోస్కుంట వధా చేయకుండి బిడ్డ పుణ్యం ఉంటది.
మున్ముందు ఉన్నది ఎండ కాలం బొట్టు బొట్టు ఇల్వి ఎరుకైతది గసల్‌ ఇ నీటిని పారే బంగారం అంటరంట పాస్‌ పక్షులు సెట్లు సేన్లు మనుసులు గాందరికి నీళ్ళు అక్కరెన్నై
రాంజాన్‌ దినం కస్మలి చాచ,మస్తాన్‌ గిట్ట ఐలయ్య తాత కాకోల్లను ఇండ్ల కు తొలుక పోయి మస్తుగా షీర్‌ కూర్మ పిలంచిన్డ్రట తాత జబర్దస్త్‌ ఉండు కానీ కాజులు నమ్లలేకుంటి నంటుడె ఆడాల తానకి నేను కూడా మెహెమాన్‌ పోయి నామ్‌ చిన్నప్పటి కాడి నుంచి గది రివాజు తియ్యగా షీర్‌ కూర్మ తగోచి ఏమన్న తినడానికి కారం వేమన్న ఇయముని అడుగుతుంటి ఉగాదికి మనింటి కాడ చేసే పసాద పచ్చడి దుడ్డన మరేఫ గిట్ట ఇస్టాం తోనీ సప్పరించు కుంట తింతుడే.కుండల సళ్ళ గుంచి మద్దినం కూడా ఇస్తుంటిమి మొన్న ఉగాదికి ఏడాది గడిచింది లే సుస్త సుస్త గప్పటి నోటు బుక్‌ ఇడిసి కొత్త నాట్‌ బుక్‌ పెట్టిండు కదా ఈ ఏడు కూడా శ్రద్ధ తో రాయండి మంచి పనులు ఎప్పటికైన మానకుండా చేయలే.గట్ల సెస్‌ కుంట మాన్‌ మెల్‌ గోరి సెప్పేటోళ్ల మాటల్‌ పాటించుకుంట దినం దినం దేవ్లోప్‌ ఐతుంటే హ్యాపీనెస్‌ గదే సంతోషం అన్నట్టు.
సంతోషం అనేది యాడికెళ్ళో రాదు రా మన మనసుల మనం చేసే పనులల తోనే వస్తది గంటే మన సంతోషం మన సేతుల పనే కద ఉన్న కాడికి బలంగా తిని రోగాలు కూడా రాకుండా ముందు గానే సూదులు కూడా పొడిచి కుంటే పికర్‌ లేకుంట బతుకోచు ఇగా పోయి రండ్రి గూడ్‌ ఆఫ్టర్‌ నూన్‌.

– గంగరాజ పద్మజ, 9247751121

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -