Saturday, July 12, 2025
E-PAPER
Homeజిల్లాలుబీసీలకు 42% రిజర్వేషన్ పట్ల హర్షం ..

బీసీలకు 42% రిజర్వేషన్ పట్ల హర్షం ..

- Advertisement -

ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి లింగమూర్తి 
నవతెలంగాణ – పెద్దవంగర
: రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం హర్షణీయమని బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బోనగిరి లింగమూర్తి అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో అమలులో ఉన్న పంచాయతీరాజ్‌ చట్టం-2018ను సవరించి, ఆర్డినెన్స్‌ను తేవడం ద్వారా ఈ రిజర్వేషన్లను అమలు చేయనుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం 42 శాతం రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళతామని ప్రకటించడం, దానికనుగుణంగా చర్యలు చేపట్టడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -