బి.వెంకట్, టి.సాగర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రముఖ విద్యావేత్త, సామాజిక ఉద్యమ కారులు, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య వందో జన్మదినం సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం ఆలిం డియా ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.రజనీ కాంత ్, టి.నాగరాజు, ఉపాధ్యక్షులు డి.కిరణ్ ,రాష్ట్ర కమిటీ సభ్యు లు జె.రమేష్ హైదరాబాద్, విద్యానగర్‌లోని చుక్కా రామయ్య నివాసానికి వెళ్లి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బి.వెంకట్ ,టి.సాగర్ మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది విద్యార్థులు ఐఐటీ పూర్తి చేసి, ప్రపంచ దేశాల్లో స్థిరపడడానికి ఆయన కృషి చేశారని తెలిపారు. అనేక సామాజిక సమస్యలపై పోరాడిన గోప్ప వ్యక్తి అని పేర్కొన్నారు. రాజకీయాల్లో దిక్సూచిగా తన పాత్ర పోషించాడని తెలిపారు.
చుక్కా రామయ్యకు జన్మదిన శుభాకాంక్షలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



