నవతెలంగాణ -ముధోల్
కాలాన్ని ఆయుధంగా మార్చుకుని తన కవిత్వం, రచనల ద్వారా ప్రజలకు చైతన్యం కల్పించిన మహనీయుడు ప్రజాకవి కాళోజీ నారాయణరావు 111వ జయంతిని నియోజకవర్గ కేంద్రమైన ముధోల్లోని తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీలత మాట్లాడుతూ సమసమాజ నిర్మాణానికి కాళోజీ బాటలు వేసారని తెలిపారు .ఆయన జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకోవడం రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమం ఊపిరిగా జీవించిన ప్రజాకవి, తెలుగు భాష, ప్రజల అవసరాల కోసం కాళోజీ నిరంతరం కృషి చేశారని, అన్నారు.తన కవితలు, రచనల ద్వారా ప్రజల్లో స్పూర్తి నింపారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ బిట్ల పెర్సెస్ ,నాయబ్ తహసీల్దార్ తెలంగ్ రావు,తాలూకా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు రోళ్ల రమేష్,బిడిసి అధ్యక్షుడు విట్ఠల్, మాజీ సర్పంచ్ అనిల్, తదితరులు, పాల్గొన్నారు.