Saturday, September 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్108 సిబ్బంది సమయస్ఫూర్తితో అంబులెన్స్ లోనే సుఖ ప్రసవం

108 సిబ్బంది సమయస్ఫూర్తితో అంబులెన్స్ లోనే సుఖ ప్రసవం

- Advertisement -

108 సిబ్బంది సమయస్ఫూర్తితో అంబులెన్స్ లోనే సుఖ ప్రసవం
నవతెలంగాణ-ధర్మసాగర్
108 సిబ్బంది సమయస్ఫూర్తి, సహకారంతో అంబులెన్స్ లోనే సుఖ ప్రసవం చేశారు. స్థానికులు,108 సిబ్బంది వివరాలు ప్రకారం శనివారం ఉదయం 6 గంటలకు ధర్మసాగర్ మండలం రాపాకపల్లిలో ఒక మహిళకు పురిటినొప్పులతో బాధపడుతూ ఉండగా కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్ కి ఫోన్ చేశారు. తక్షణమే స్పందించిన ధర్మసాగర్ 108 సిబ్బంది హుటా హుటిన రాపాకపల్లికి చేరుకొని పురిటి నొప్పులతో పడుతున్న మహిళను వెంటనే అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. కానీ, రింగ్ రోడ్డు వద్దకు వచ్చేటప్పటికే ఆమెకు నొప్పులు ఎక్కువ అవ్వడంతో ఇఆర్సిపి డాక్టర్ శివ సలహా తీసుకొని సమయస్ఫూర్తితో 108 సిబ్బంది టెక్నీషియన్ సుధా, హైలెట్ ప్రవీణ్ సాధారణ కాన్పు చేశారు. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిందనీ, అనంతరం వారికి మెరుగైన చికిత్స నిమిత్తం హనుమకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా 108 సిబ్బందిని కుటుంబ సభ్యులు, 108 సిబ్బంది జిల్లా మేనేజర్ మండ శ్రీనివాస్ అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -