Sunday, October 19, 2025
E-PAPER
Homeజిల్లాలుప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు: మంత్రి శ్రీధర్ బాబు

ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు: మంత్రి శ్రీధర్ బాబు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మంథని నియోజకవర్గ, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాలతోపాటు, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికి ఆదివారం తెలంగాణ రాష్ట్ర ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఆనందంగా, సురక్షితంగా దీపావళి పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. చిన్నారులు టపాసులు కాల్చే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, పెద్దలు పర్యవేక్షణలో ఉండాలని సూచించారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ  దీపావళి  వెలుగులు ప్రతి ఇంటికి సంతోషం, ఆరోగ్యం, ఆనందాన్ని నింపాలని మంత్రి ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -