- Advertisement -
నవతెలంగాణ – పాలకుర్తి
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతిబింబంగా నిలిచే బతుకమ్మ వేడుకలను పురస్కరించుకొని పాలకుర్తి నియోజకవర్గం ఆడపడుచులందరికీ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీ రెడ్డిలు ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ వేడుకలు ఎంతో స్ఫూర్తినిస్తాయని తెలిపారు. ప్రశాంతమైన వాతావరణం లో చెరువు గట్ల వద్ద మైదానాల్లో బతుకమ్మ వేడుకలను ఆడపడుచులు ఆటపాటలతో సంబరాలు జరుపుకోవాలని సూచించారు.
- Advertisement -