– పరిశ్రమ మేనేజర్ నాగబాబు కు సన్మానం
నవతెలంగాణ – అశ్వారావుపేట
మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి పురస్కరించుకుని నిర్వహించే ఇంజనీర్స్ డే ను సోమవారం లయన్స్ క్లబ్ అశ్వారావుపేట మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక టీవీఎస్ షోరూం, లయన్స్ క్లబ్ అధ్యక్షులు,ప్రముఖ న్యాయవాది లక్కినేని నరేంద్రబాబు అద్యక్షతన ఆయిల్ ఫెడ్ పామాయిల్ పరిశ్రమ మేనేజర్ ఎం.నాగబాబు,ఐబీ ఏఈఈ ఎల్. శ్రీనివాసరావు లను శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్ గా ఆయన సేవా స్ఫూర్తిని లయన్స్ క్లబ్ సభ్యులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ లయన్ యూ.ఎస్ ప్రకాష్ రావు,కంచర్ల రామారావు, కంచర్ల రమేష్,కోటగిరి మోహన్ రావు,లయన్స్ క్లబ్ సెక్రటరీ బలమూరి సూర్యారావు, జోనల్ చైర్ పర్సన్ లయన్ దూబగుంట్ల దుర్గారావు లు పాల్గొన్నారు.