- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
మన ఇస్రో శాస్త్రవేత్తల అసమాన ప్రతిభకు, చంద్రయాన్-3 విజయానికి ప్రతీకగా నేడు జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని జుక్కల్ మాజీ శాసనసభ్యులు హన్మంత్ షిండే అన్నారు. శనివారం ఓ ప్రకటన విడుదల చేస్తూ మాట్లాడారు. భవిష్యత్తులో ఇస్రో శాస్త్రవేత్తలు మరిన్ని ప్రయోగాలు చేసి దేశ ఖ్యాతిని మరింత పెంచాలని ఆకాంక్షించారు. భారతదేశంలోని అంతరిక్ష ఇస్రో శాస్త్రవేత్తలు ఎంతో నైపుణ్యం కలిగిన వారు ఉన్నారని వారిని గుర్తించడం, ప్రోత్సహించడం వలన దేశ భద్రతకు ముప్పు వాటిల్లకుండా కాపాడుకున్న వారమవుతామని వారు దేశ నక సంపద కాపాడినంత గొప్పగా భావిస్తామని ఆయన అన్నారు.
- Advertisement -