సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి నూతన సంవత్సర శుభా కాంక్షలు తెలిపారు. తెలంగాణ రైజింగ్ విజన్-2047 లక్ష్యసాధన దిశగా 2026లో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రైతులతో పాటు మహిళలు, కార్మికులు సహా అన్ని వర్గాల ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని గుర్తు చేశారు. కొత్త సంవత్సరంలో ప్రతి కుటుంబం ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలనీ, ప్రజలందరూ ఆనందంతో, ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు.
ప్రభుత్వ నిర్ణయాలతో ప్రజల జీవితాల్లో మార్పు పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్
రాష్ట్ర ప్రజలకు పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరం రాష్ట్ర ప్రజల జీవితాల్లో శాంతి, సౌభాగ్యం, సమృద్ధిగా నింపాలని ఆకాంక్షించారు. గతేడాది ప్రజాస్వామ్య విలువలను మరింత బలపరిచేలా సామాజిక న్యాయం, సంక్షేమ అభివృద్ధి లక్ష్యాలతో ముందుకు సాగిందని తెలిపారు. ముఖ్యంగా రైతులు, కార్మికులు, మహిళలు, యువత ఆశలు నెరవేర్చే దిశగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకొచ్చాయని అన్నారు.
రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



