కంపోజర్-హీరో జీవీ ప్రకాష్ కుమార్ నటిస్తున్న నూతన చిత్రం ‘హ్యాపీ రాజ్’. హీరో- డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన మరియా రాజా ఎలాంచెజియన్ దర్శకత్వం వహించారు. బియాండ్ పిక్చర్స్ బ్యానర్ పై జైవర్ద నిర్మించారు. మ్యాడ్ ఫేం శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్‌గా నటిచింది.
మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్‌ఎల్పీ ద్వారా ఈనెల 27న తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
తాజాగా మేకర్స్ ఫస్ట్ సింగిల్ ‘అద్దిరా లెక్క’ సాంగ్ రిలీజ్ చేశారు. సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్ అదిరిపోయే బీట్స్‌తో ఈ సాంగ్‌ని కంపోజ్ చేశారు. గాయకుడు గోవింద్ ప్రసాద్ ఎనర్జీతో పాడిన ఈ పాటకు రెహ్మాన్ రాసిన లిరిక్స్ మంచి వైబ్ తీసుకొచ్చాయి.
ఈ సాంగ్‌లో జీవీ ప్రకాష్ కుమార్ చేసిన డ్యాన్స్ మూమెంట్స్ స్పెషల్ హైలైట్‌గా నిలిచాయి. రిలీజ్ అయిన వెంటనే ఈ సాంగ్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ అందుకుంటూ, ఇన్‌స్టంట్ హిట్‌గా మారింది అని చిత్ర యూనిట్ తెలిపింది.
‘హ్యాపీ రాజ్’ రిలీజ్‌కి రెడీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



