Saturday, March 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ముస్లిమ్ సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు: మాజీ ఎమ్మెల్యే

ముస్లిమ్ సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు: మాజీ ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
జుక్కల్ మండల కేంద్రంలోని ముస్లిం సోదరులు ఏర్పాటుచేసిన రంజాన్ కార్యక్రమంలో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి రంజాన్ పండుగలో పాలు పంచుకున్నారు. అదేవిధంగా ముస్లీం సోదరులందరికీ రంజీన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పవిత్ర రంజాన్ పండుగను ఉపవాస దినాలు పాటించి నియమనిష్ఠలతో సోదరులు కఠినమైన దీక్షలో పాల్గొంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు వాస్రే రమేష్ , లాడేగావ్ సర్పంచ్ రాజశేఖర్ పటేల్, మాజీ ఎంపీపీ బస్వంత్ సెట్కార్ , మాజీ సర్పంచ్ బొల్లి గంగాధర్, నాయకులు విట్టు పటేల్ , శివాజీ పటేల్ ,  తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -