- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ నియోజకవర్గం ప్రజలకు జుక్కల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే గురువారం రంజాన్ మాస ప్రారంభ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఆయన మాట్లాడుతూ.. ఇస్లాం మతస్తులు పవిత్రంగా భావించే రంజాన్ మాసం ప్రారంభమైందని అన్నారు. భక్తి శ్రద్ధలతో, శాంతియుత వాతావరణంలో పండుగను నిర్వహించుకోవాలని ఆయన సూచించారు. ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లీం సోదరులందరికీ అల్లాహ్ దీవెనలు అందాలని కోరుతున్నానని అన్నారు.
- Advertisement -



