నవతెలంగాణ – తుంగతుర్తి
ముస్లిం సోదర సోదరీమణులకు తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. లౌకికవాదం, మత సామరస్యానికి రంజాన్ ప్రతీకని, మైనార్టీల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. పవిత్ర రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని ముస్లిం సోదర సోదరీమణులకు సామేలు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
నెల రోజుల పాటు భక్తిశ్రద్ధలతో చేసిన కఠోర ఉపవాస దీక్షలు ముగిసిన అనంతరం వచ్చే ఈ ఆనందకరమైన పండుగను ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి అత్యంత సంతోషంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. సమాజంలో లౌకికవాదానికి, మత సామరస్యానికి రంజాన్ పర్వదినం ఒక గొప్ప ప్రతీకగా నిలుస్తుందని కొనియాడారు. ఇస్లాం పవిత్ర గ్రంథం ఖురాన్ అవతరించిన ఈపవిత్ర మాసంలో ముస్లింలు అత్యంత కఠినంగా ఆచరించే ఉపవాసాలు, దేవునిపై భక్తితో క్రమశిక్షణతో కూడిన ప్రార్థనలు సకల మానవాళికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.



