Sunday, September 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహిళలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు 

మహిళలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు 

- Advertisement -

ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టిపిసిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి 
నవతెలంగాణ – పాలకుర్తి

తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు స్ఫూర్తినిచ్చే బతుకమ్మ సంబరాల్లో భాగంగా పాలకుర్తి నియోజకవర్గం లోని మహిళలందరికీ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీ రెడ్డిలు ఆదివారం సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూలనే పూజించడం తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను అడ్డం పడుతుందని తెలిపారు. సద్దుల బతుకమ్మ వేడుకలను మహిళలు అంగరంగ వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. 

సభ్యుల బతుకమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు గ్రామపంచాయతీలు మైదానాలను సిద్ధం చేశారు. గ్రామస్తుల సహకారంతో పంచాయతీ కార్యదర్శులు విద్యుత్ దీపాలను అలంకరించారు. సద్దుల బతుకమ్మ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పాలకుర్తి సీఐ వంగాల జానకి రామ్ రెడ్డి, ఎస్సై దూలం పవన్ కుమార్లు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పాలకుర్తి పట్టణంలో నిర్వహించే సద్దుల బతుకమ్మ వేడుకల సందర్భంగా బతుకమ్మను పేర్చి ప్రతిభను కనబరిచే మహిళలకు బహుమతులను అందజేస్తామని మండల ఆర్యవైశ్య సంఘం మహిళా అధ్యక్షురాలు బోనగిరి రమాదేవి, కార్యదర్శి బొగ్గరపు దివ్య జ్యోతి, కోశాధికారి నాగమల్ల వనితలు తెలిపారు. ఈ అవకాశాన్ని పాలకుర్తి పట్టణ మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -